నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేసే విద్యార్థుల ప్రతిభ బాగుందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ప్రశంసించారు. శనివారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో రాజ్‌భవన్ స్కూల్ నుంచి టీఐఇ యంగ్ ఎంటర్ ప్రిన్యూర్‌షిప్‌కు ఎంపికైన 10 మంది విద్యార్థుల ఆవిష్కరణల ప్రదర్శనను ఆమె తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కష్టపడి జీవితంలో ఉన్నతంగా ఎదిగిన వారికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం విజయానికి దోహదం చేస్తాయని సూచించారు ఈ కార్యక్రమంలో టీఐఇ హైదరాబాద్ ఛార్టర్ మెంబర్లు ఎన్.వెంకటేష్, భాను ప్రకాష్ వర్మ, రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ వి.ఏ.ఎస్.కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.