హెడ్ మాస్టర్ కోసం విద్యార్థులు ఉపాధ్యాయులు పడిగాపులు

హెడ్ మాస్టర్ ఎదురుచూస్తున్న విద్యార్థిని విద్యార్థులు
హెడ్ మాస్టర్ ఎదురుచూస్తున్న విద్యార్థిని విద్యార్థులు
– ఆలస్యంగా జాతీయ జెండా ఆవిష్కరణ

నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్వాతంత్ర దినోత్సవం నాడు కూడా సమయపాలన పాటించ లేదు. ఉదయం తొమ్మిది గంటలకు కూడా ఆయన పాఠశాలకు చేరుకోలేదు. దీంతో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన పెద్ద తడుగూర్ గ్రామ ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో  ఆ గ్రామ ఉపసర్పంచ్ హెడ్మాస్టర్ కు ఫోన్ చేసి ప్రశ్నించగా, వస్తున్నాను వస్తున్నాను అంటూ తొమ్మిది గంటల తర్వాత రావడం ఆ గ్రామంలో జెండా ఆవిష్కరణ ఆలస్యంగా జరిగింది. హెడ్మాస్టర్ సమయపాలన పాటించకపోవడంపై ఆ గ్రామ ఉపసర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడే సమయపాలన పాటించకపోతే మిగతా ఉపాధ్యాయుల ఎలా ఉంటారో ప్రభుత్వం అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.