జోనల్‌స్థాయి క్రీడల్లో సత్తా చాటిన జ్యోతిరావు పూలే విద్యార్థులు

నవతెలంగాణ-డెస్క్‌
ఘనపూర్‌ మండలంలోని జడ్పిఎస్‌ఎస్‌ లో మంగళవారం జరిగిన జోనల్‌ స్థాయి క్రీడా పోటీలలో రేగొండ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలకు చెందిన 26మంది విద్యార్థులు,బాలురు సత్తా చాటి జిల్లా స్థాయికి ఎంపిక అయినట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ శిలారమని తెలిపారు.17 సంవత్సరాల విభాగంలో ఖోఖో క్రీడల్లో సాయి చరణ్‌, రామ్‌ రక్షిత్‌, అనిరుధ్‌,వినరు,రామ్‌ చరణ్‌,రాజ్‌ కుమార్‌, కబడ్డీ క్రీడల్లో సాయి తేజ, రాజ్‌కుమార్‌ చరణ్‌తేజ, వాలీ బాల్‌ క్రీడల్లో అరవింద్‌, ఈశ్వర్‌,రాకేష్‌,చరణ్‌, గుణ శేఖర్‌ లు 14 సంవత్సరాల విభాగంలో ఖోఖో క్రీడల్లో శ్రావణ్‌,గణేష్‌,సచిన్‌,ఆహ్విత్‌ లు కబడ్డీ క్రీడల్లో జశ్వంత్‌, అరవింద్‌, రామ్‌ చరణ్‌, మని తేజ, రితిన్‌, వాలీ బాల్‌ క్రీడల్లో రామ కష్ణ,సాయి కుమార్‌, శివ ప్రసాద్‌ జిల్లాస్థాయి క్రీడలకు ఎంపికైనట్లు ఆమె తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపాల్‌ శీలారమణి హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరుణ జ్యోతి,పాల్‌,సతీష్‌ పీఈటీ మండల ధనపాల్‌ తదితరులు పాల్గొన్నారు.