విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్సై ఉపేందర్ అన్నారు. శుక్రవారం చిన్నవంగర లోని కేజీబీవీ విద్యార్థులకు బాలికల హక్కులు, చట్టాలపై ఎస్సై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు విద్యార్థులు భయపడకుండా ప్రశ్నించడం నేర్చుకోవాలి అన్నారు. బాలికల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు డయల్ 100 కు సమాచారం అందించాలన్నారు. మొబైల్ ఫోన్ కు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఏఎస్సై విజయ రాజు, పాఠశాల ప్రత్యేక అధికారి గంగారపు స్రవంతి, కానిస్టేబుళ్లు సుధాకర్, అనిత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.