విద్యార్థులు చదువుతో పాటు క్రీడాల్లో కూడా రాణించాలి

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

విద్యార్థులు చదువుతోపాటు క్రీడా రంగాలలో రాణించాలని శ్రీ అపోలో ఒకేషనల్ కాలేజ్ ప్రిన్సిపల్ వేముల గణేష్ అన్నారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ అపోలో ఒకేషనల్ జూనియర్ కళాశాలలో స్వాతంత్య్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకోని ఆటల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గణేష్ మాట్లాడుతూ విద్యార్థులలో మానసిక ఉల్లాసం, పోటీతత్వం పెంపొందేలా ఉండడానికి ఆటల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రీడల్లో  విద్యార్థుకు గెలుపు, ఓటమిలను సమానంగా స్వీకరించాలని  సూచించారు.చదువులో శ్రద్ధ కనబరుస్తూ జీవితంలో ముందుకు వెళ్లాలని అన్నారు. విద్యార్థిని విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, రన్నింగ్, క్యారమ్, చెస్ లతో పాటు వివిధ రకాల ఆటలను ఆడేలా ప్రోత్సహిస్తామన్నారు. ఈకార్యక్రమంలో అధ్యాపక బృందం మమత, ప్రవీణ్, రాజేంద్ర ప్రసాద్, సుజాత, అఖిల, అధ్యాపకేతర బందం శేఖర్. అరుణ తదితరులు పాల్గొన్నారు.