నవతెలంగాణ కంఠేశ్వర్
చంద్రశేఖర్ ఆజా జీవిత స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు వెళ్లాలి అని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ నగర కమిటీ అధ్వర్యంలో చంద్రశేఖర్ ఆజాద్ 117వ జయంతిని స్థానిక ఎస్సీ హాస్టల్లో జరపడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ నగర ఉపాధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ.. భారత దేశ స్వాతంత్రం కోసం అనేక మంది మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేయడం జరిగింది. అందులో చంద్రశేఖర్ ఆజాద్ అతి చిన్న వయసులోనే దేశ స్వాతంత్రం కోసం తన పోరాటాన్ని ప్రారంభించి అనేకమంది యువకులను ఉత్తేజితులను చేసి వారిలో దేశభక్తిని పెంపొందించి దేశ స్వాతంత్రం కోసం వారందరూ పోరాడేలా విశేషమైన కృషి చేయడం జరిగింది ఒక బ్రిటిషోర్ తుపాకి తూటాకు కాదు నా తూటాతో నేను చనిపోతానని చెప్పి దేశ ఖ్యాతిని పౌరుషాన్ని ప్రపంచానికి తెలియజేసేలా తన ప్రాణ త్యాగాన్ని చేసినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత, విద్యార్థులు సమాజ సమస్యల పట్ల తమ విద్యారంగ సమస్యల పట్ల ఆజాద్ జీవిత స్ఫూర్తితో ముందుకెళ్తూ వాటిని పరిష్కరించేలా కృషి చేస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకొని దేశాభివృద్ధిలో భాగమవ్వలని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హాస్టల్ కమిటీ నాయకులు అజయ్ ,విష్ణు,రాజు,బాబు తదిరులు పాల్గొన్నారు.