విద్యార్థులే తల్లిదండ్రులతో ఓటు వేయించాలి

– హనుమకొండ జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌
నవతెలంగాణ-హనుమకొండ
విద్యార్థులు తమ కుటుంబంలో ఓటుహక్కు కలి గిన ప్రతి ఒక్కరినీ ఓటు వేసే విధంగా మీవంతు బాధ్య తగా చైతన్యం తీసుకురావాలని హనుమకొండ జిల్లా కలె క్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు.హనుమకొండ లష్కర్‌ బ జార్‌లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో స్వీప్‌ ఆధ్వర్యం లో విద్యార్థులకు ఓటరు చైతన్యంపై మంగళవారం ప్ర త్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జి ల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భావి భారత ఓటర్లైనా విద్యార్థులూ ఓటు హక్కు కలిగిన తమ కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల ఉన్నవారు ఓటును తప్పకుండా వేసే విధంగా చైతన్యం తీసుకు వచ్చే బాధ్యతను కలిగి ఉం డాలన్నారు. ఎన్నికల్లో పల్లె లు, పట్టణాల్లోఎక్కువ ఓటిం గ్‌శాతం పెరిగే విధంగా కృ షి చేద్దామన్నారు. జిల్లాలో తొలిసారిగా పశ్చిమ నియో జకవర్గంలో పాఠశాల విద్యార్థులు ఓటును గురించి చైత న్యం తీసుకువచ్చే విధంగా, ఓటు హక్కు కలిగిన వారిని ఓటు వేసేలా ప్రయత్నం చేసే ప్రమాణ పత్రం కార్యక్ర మాన్ని చేపట్టినట్లు తెలిపారు. అన్ని పాఠశాలల్లో ఈ కా ర్యక్రమం చేపట్టాలని డిఈవోకు సూచించారు. ఓటు వేసేవిధంగా పాఠశాల స్థాయిలో అవగాహన కల్పించాల న్నారు. విద్యార్థులు ప్రమాణ పత్రంలో ఓటు ఉన్నవారి సంతకాలను తీసుకుని పాఠశాలలో అందజేయాల న్నారు. మిషన్‌ 2029లో ఓటింగ్‌ శాతం పెరిగేవిధంగా కషి చేద్దామన్నారు. ట్రైనీ కలెక్టర్‌ శ్రద్ధా శుక్ల మాట్లాడుతూ నవంబర్‌ 30న జరగనున్న ఎన్నికల్లో ఓటు వేయించాలని విద్యా ర్థులకు సూచించారు. ఈ సందర్భంగా డిఈవో డాక్టర్‌ అబ్దుల్‌ హై మాట్లాడుతూ నవంబర్‌ 28వరకూ ఓటు హక్కు పై చైతన్యం తీసుకువచ్చే ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రతి పేరెంట్‌ ఓటు వేసే విధంగా విద్యార్థుల్లో చైతన్యం తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమం అన్ని పాఠశాలల్లో అమలయ్యేవిధంగా ఎంఈవో, హెచ్‌ఎం, సిఆర్పీలకు వెంటనే తెలియజేస్తా మన్నారు. ఈ సందర్భంగా ఓటు హక్కు కలిగిన తమ కుటుంబ సభ్యులతో ఈ నెల 30వ తేదీన జరగనున్న ఎ న్నికల్లో ఓటును తప్పకుండా ఓట్లు వేయిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ‘ ఓడిపోనియ్యకు నీ ఓటును ‘ అంటూ సాగిన గీతానికి విద్యార్ధినులు నత్యం చేశారు. అదేవిధంగా వే యిద్దాం.. వేయిద్దాం, కుటుంబ సభ్యులతో ఓటును వే యిద్దాం, గెలిపిద్దాం.. గెలిపిద్దాం…. ప్రజాస్వామ్యాన్ని గె లిపిద్దాం అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో స్వీప్‌ నోడల్‌ ఆఫీసర్‌ హరిప్ర సాద్‌, కమ్యూనిటీ మొబిలైజెషన్‌ ఆఫీసర్‌ బోయినపల్లి రాధ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమ, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.