ఉపాధ్యాయ హక్కుల కోసం పోరాడుతున్న సంఘం ఎస్ టియుటిఎస్

నవతెలంగాణ – కంటేశ్వర్
ఉపాధ్యాయ హక్కుల కోసం పోరాడుతున్న సంఘం ఎస్టీయూ టీఎస్ అని,అప్పటి నిజాం ప్రభుత్వము నుంచి నేటి వరకు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న సంఘం స్టేట్ టీచర్స్ యూనియన్ అని జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం స్టేట్ టీచర్స్ యూనియన్ 76వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్టియు భవాన్ (STU BHAVAN) లో పతాక ఆవిష్కరణ చేశారు. సంఘ వ్యవస్థాపకులుమగ్దుం మొయినుద్దీన్,అప్పటి నాయకులు అయిన కాళోజీ నారాయణరావు,జయ శంకర్ సర్ చూపిన మార్గంలో నడుస్తూ,ఉపాధ్యాయ సమస్యలపట్ల పోరాడుతూ,పాఠశాలలను పరిరక్షించుకుంటామని సంఘనాయకులు ప్రతిజ్ఞ చేసినారు.తర్వాత జిల్లా అద్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం విద్యావ్యవస్థ పట్లా చూపిస్తున నిర్లక్ష్య వైఖరి సరికాదని,అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని అన్నారు.317 బాధిత ఉపాధ్యాయులకు సత్వర న్యాయం చేయాలని,బదిలీలు,పదోన్నతుల పక్రియను జూన్ 13 తర్వాత చేపట్టాలని,పాఠశాలలో విద్య వాలంటీర్లను, పారిశుద్ధ్య కార్మికులను తక్షణమే నియమించాలని, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు బదిలీల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాకార్యదర్శి ధర్మేందర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి రమేష్,జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్,యాదగిరి,మల్లయ్య,పవన్ కుమార్,సురేందర్,గంగకిషన్,సనఉద్దీన్,సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.