
బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజనాన్ని సబ్ కోర్టు జడ్జి నసీం సుల్తానా శనివారం తనిఖీ చేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్న జడ్జి సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని ఆదేశించారు. కోడిగుడ్డు, ఒకరోజు పప్పు దిన్సులు, ఒక రోజు కూరగాయలు తప్పనిసరిగా ఉండాలి అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోతే కఠీన చర్యలు తీసుకుంటామని జడ్జి పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజన నిర్వహణపై పర్యవేక్షణ చేస్తూ ఒక ఉపాధ్యాయుడు భోజనం విద్యార్థులతోపాటు చేయాలన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు సక్రమంగా రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జడ్జి దృష్టికి మధ్యాహ్నం భోజనంఏజెన్సీ నిర్వాహకులు తీసుకొచ్చారు. నిరుపేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేకచొరవ తీసుకొని మంచి ప్రయోజకులంగా విద్యార్థులను తయారు చేయాలని ఆమె హితవు పలికారు. పాఠశాలల్లోని డిజిటల్ క్లాసులను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యతోపాటు జనరల్ నాలెడ్జి అధికంగా పెంచుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి రాజా గంగారం, లీగల్ కోర్ట్ కౌన్సిలర్ రాజేశ్వర్, సుఖేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనరసయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.