చిన్నకోడూరు ఠాణా నూతన ఎస్ఐగా సుభాష్ గౌడ్

నవతెలంగాణ – చిన్నకోడూరు
చిన్నకోడూరు ఠాణా నూతన ఎస్ఐ గా సుభాష్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా విధులు నిర్వర్తించిన శివానందం బదిలీ పై వెళ్ళారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ సుభాష్ గౌడ్ ఎన్నికల నియమావళి ప్రకారం చిన్నకోడూరు. కు బదిలీ కాగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం మండల ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.