– కంటి వెలుగు టీంకు ప్రత్యేక సన్మానం చేసిన కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని త్రీ టౌన్ ప్రాంతంలోని గాంధీచౌక్‌లో 36వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు ముగింపు వేడుకలలో స్థానిక కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశానుసారం ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సూచన మేరకు రాష్ట్ర మొత్తం కంటి వెలుగు కార్యక్రమం చేపట్టారని దీంట్లో భాగంగా మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ సహాయ సహకారాలతో 36వ డివిజన్ ప్రజల ఆదరణతో విజయవంతంగా ముగిసిందని అన్నారు. గత 15 రోజులుగా డివిజన్ ప్రజలకు సేవలందించినందుకు కంటి వెలుగు టీం ను స్థానిక కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు ప్రత్యేకంగా శాలవాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నగర్ పిహెచ్‌ఓ డాక్టర్ లోహిత, డాక్టర్ లికిత, కంటి వెలుగు ఇంచార్జ్ బాలకృష్ణ, డిసిసిబి బ్యాంక్ సీఈఓ వీరబాబు, హెల్త్ సూపర్వైజర్ వేణు, డి.ఈ.ఓ. సుబ్బారావు, హెచ్.వి. భారతి, ఏ.ఎన్.ఎం నాగమణి, అంగన్వాడీ టీచర్ అంజూర, తదితరులు పాల్గొన్నారు.