విజయవంతంగా ముగిసిన సీఎం కప్ క్రీడలు

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రంలో సీఎం కప్ తెలంగాణ క్రీడ సంబురాలు బుధవారం విజయవంతంగా ముడి సాయి. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో సాయంత్రం క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేశారు. అన్ని గ్రామాల నుండి ఆసక్తి కలిగిన క్రీడాకారులు పాల్గొని కబడ్డీ, వాలీబాల్, కోకో, అథ్లెటిక్స్ ఆ టల పోటీలలో విజేతలుగా ఫస్ట్, సెకండ్, థర్డ్, గెలిచిన జట్లకు దాతల ద్వారా 52000/- నగదు సేకరించి నగదు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు అందజేయబడినవి. దాతలు పసర గ్రామానికి చెందిన మెహర్ బ్రదర్స్ 15000, ఎస్సై కరుణాకర్ రావు 9000, మండల ప్రత్యేక అధికారి నాగ పద్మజ 6000, రామకృష్ణ వాటర్ ప్లాంట్ 5000, పీఎస్ఆర్ గార్డెన్ శ్రీనివాస్ రెడ్డి 5000, వంశీకృష్ణ ఫర్టిలైజర్స్ గోవిందరావుపేట 2000, ఎంపీడీవో ఆఫీసు సూపరిండెంట్ సాయి దుర్గ లక్ష్మీ 3000, ఉప సర్పంచ్ ఏ హనుమంతరావు 2000 దాతల ద్వారా సేకరించి క్రీడలలో పాల్గొని విజేతలుగా నిలిచిన జట్లకు ఉత్సాహపరచుటకు పంపిణీ చేయనైనది. మండల క్రీడల చైర్మన్ ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విజేతలుగా నిలిచిన జట్లు జిల్లా స్థాయిలో పాల్గొని విజేతలుగా నిలబడి రాష్ట్ర స్థాయిలో సీఎం కప్పు గెలుచుకోవాలని నగదు బహుమతి అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో, మండల ప్రత్యేక అధికారి నాగ పద్మజ, తాసిల్దార్ ఏ రాజ్ కుమార్, ఎస్ఐ సిహెచ్ కర్ణాకర్ రావు, ఎంఈఓ దివాకర్, ఎంపీడీవో తరపున సూపరిండెంట్ సాయి దుర్గ లక్ష్మి, ఏపీఓ ప్రసూన, సర్పంచ్ లావుడియా లక్ష్మి, ఉప సర్పంచ్ హనుమంతరావు, పంచాయతీ కార్యదర్శులు, పీడీలు, పీఈటీలు శ్రీ ఆదినారాయణ, సుధాకర్, కృష్ణ, నరేష్, కనకయ్య, దీప్తి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చింత కృష్ణ మరియు పుర ప్రముఖులు పాల్గొన్నారు.