రాష్ట్రస్థాయి ఎంఎల్ బి బేస్ బాల్ పోటీలకు సుద్ధపల్లి విద్యార్థినిలు ఎంపిక..

నవతెలంగాణ-డిచ్ పల్లి : డిచ్ పల్లి మండలంలోని సుద్ధపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులు సుద్ద పల్లి కళాశాలలో నిర్వహించిన  జిల్లాస్థాయి బేస్ బాల్  పోటీలలో మంచి ప్రతిబను కనబరిన ధరణి, దర్శిని ,నిశిత ,భావన ,భవ్య,శ్రీవాణి, స్వస్తిక ,మితున,నవజ్యోతి చక్రిక ,షెర్లిన్శిశైని, సైలస్య, ష్రాష్ట్రస్థాయి కీ  ఎంపిక కావడం జరిగిందని పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ గోదావరి అభినందించారు.ఈ సందర్భంగా గోదావరి మాట్లాడుతూ సికింద్రాబాద్  ఉస్మానియా యూనివర్సిటీ లో 12 నుoచి 14 వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో  పాల్గొనున్నారు . వీరందరినీ పాఠశాల, కళాశాల   ప్రిన్సిపల్ గోదావరి, పిఈటీ లత, కోచ్ మౌనిక లు ప్రత్యేకంగా  అభినందించారు.మంచి ప్రతిభా కనబర్చి కళాశాల, తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతులు సంపాదించే విధంగా చూడాలని వారన్నారు.