మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన సూడి శ్రీనివాస్ రెడ్డి

నవతెలంగాణ-గోవిందరావుపేట
4000 రూపాయల ఆర్థిక సహాయం మండలంలోని లక్నవరం పంచాయతీ దుంపెల్లి గూడెం గ్రామానికి చెందిన పున్నం రజిత గత కొద్ది రోజుల క్రితం చనిపోగా గురువారం స్థానిక ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి మరియు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సూరపునేని సాయికుమార్ లు పరామర్శించి 4 వేల రూపాయలు 25 కేజీల బియ్యం ఆర్థిక సహాయంగా అందించారు. గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి రజిత కుమారుడు పున్నమి రవి గ్రామ యూత్ కమిటీ అధ్యక్షులు వీరి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారి కుటుంబానికి బి ఆర్ ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్,పృథ్వీరాజ్ ఉట్ల గోవిందరావు  సోషల్ మీడియా కోఆర్డినేటర్, వైస్ ఎంపీపీ సూది రెడ్డి స్వప్న రెడ్డి,గ్రామ కమిటీ అధ్యక్షులు బండి రాజశేఖర్, అజిజ్ మైనార్టీ సంఘం అధ్యక్షులు, తొలి మలిదశ  గోవిందరావుపేట ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు అజ్మీర సురేష్,రాఘవులు, బాబన్న, తదితరులు పాల్గొన్నారు.