అప్పుల బాధతో ఆత్మహత్య

నవ తెలంగాణ- కాటారం
అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కాటారం మండలం ధన్వాడ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. కాటారం ఎస్సై అభినవ్ తెలిపిన వివరాల ప్రకారం ధన్వాడ గ్రామానికి చెందిన బోడ శంకరయ్య (54) కూతురి వివాహానికి అప్పు చేసి పెళ్లి చేయగా చేసినప్పులు అధికం కావడంతో కొన్ని రోజులు నుంచి మానసిక వేదనకు గురవుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో సోమవారం మధ్యాహ్నం ఇంటి పక్కన ఉన్న ఎడ్ల గుడిసెలోనీ వాసానికి ఉరి వేసుకొనీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి భార్య బోడ నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అభినవ్ తెలిపారు.