విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ

నవ తెలంగాణ – కాటారం
మండలం కేంద్రంలోని గంటగూడెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ చాలెంజ్ 2023 పిలుపుమేరకు 32 మంది కి స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం
చాలామంది దాతలు స్కూల్ బ్యాగ్ చాలెంజ్ 2023 పాల్గొని తమ వంతుగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ గిఫ్ట్ గా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని ఛాలెంజ్ రైజర్ , సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మనోహర్ పేర్కొన్నారు బుధవారం గంటగూడెం ప్రాథమిక పాఠశాలలో దాతల సహాయంతో వచ్చిన స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం ఎస్ఐ 2 తమాషా రెడ్డి, స్కూల్ బ్యాగ్ చాలెంజ్ 2023 ఛాలెంజ్ రైజర్ సిఆర్పిఎఫ్ జవాన్ మనోహర్, స్వచ్ఛంద సేవా ప్రతినిధులు కొట్టె సతీష్, సుమన్, సందీప్, బబ్లు, అర్జున్, రాజశేఖర్, చిట్టి, స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు

Spread the love