ఇద్దరు ఇంటర్‌ విద్యార్థినుల ఆత్మహత్య

నవతెలంగాణ-వనస్థలిపురం
ఇంటర్‌ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు, ఫెయిలయ్యానని మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు హైదరాబాద్‌లో జరిగాయి. వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం..వనస్థలిపురం మెడికల్‌ హెల్త్‌ కాలనీలో నివసి స్తున్న వేముల వెంకన్న కుమార్తె వేముల గాయత్రి(17) హస్తినాపురంలోని నవీన జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదివింది. మంగళవారం విడుదలైన పరీక్ష ఫలితాల్లో ఆమె ఉత్తీర్ణత సాధించలేదు. దాంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ జలంధర్‌రెడ్డి తెలిపారు. అలాగే, రాయ దుర్గం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదివిన శాంత కుమారికి మార్కులు తక్కువ వచ్చాయి. దాంతో తాము ఉంటున్న బిల్డింగ్‌ నాలుగో అంతస్తు నుంచి దూకింది. తల్లిదండ్రులు వెంటనే విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.