
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
తెలంగాణ రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో నర్సింగ్ ఆఫీసర్స్ గ్రేడ్ టు సూపరింటెండెంట్ ప్రమోషన్లు కల్పించడం పట్ల తెలంగాణ రిజిస్ట్రార్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఆర్ సుజాత రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం కోఠి లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో ఉన్న ఆస్పత్రిలో నర్సింగ్ ఆఫీసర్లకు ప్రమోషన్లు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. గ్రేట్ టు సూపర్డెంట్ ప్రమోషన్లు కల్పించారన్నారు. ఎం జెడ్ వన్, ఎం జెడ్ 2 ప్రమోషన్లు కల్పించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎం జెడ్ వన్ లో 7, ఎం జెడ్ 6 ప్రమోషన్లు పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకోవడం పట్ల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.