సూపర్ ఫుడ్స్ అంటే ఏవైతే అధిక మోతాదులో విటమిన్స్, మినరల్స్, ఆంటీ ఆక్సిడెంట్స్ కలిగి వుంటాయో అలాంటి ఆహార పదార్థాలను సూపర్ ఫుడ్స్ అంటారు. సూపర్ ఫుడ్స్ సీజనల్ వ్యాధుల నుండి రక్షిస్తాయి. త్వరగా వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ రాకుండా రోగ కారకాల నుండి రక్షిస్తాయి.
ప్రొబయోటిక్స్ : ప్రొ బయోటిక్స్ అనేవి మంచి గట్‌మైక్రోబ్‌ని కలిగి వుండి చెడు బ్యాక్టీరియల్ వ్యాధుల నుండి కాపాడుతాయి. ప్రొబయోటిక్స్ గట్ ఫ్లోరాని ఆరోగ్యంగా వుంచుతూ మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
ప్రొబయోటిక్స్ కి ఉదాహరణ : పెరుగు, మజ్జిగ
ఆంటీ ఆక్సిడెంట్స్ : ఆంటీ ఆక్సిడెంట్స్ చర్మ రక్షణకు ఉపయోగపడేవే కానీ పూర్తి ఆరోగ్యానికి వుపయోగపడవు. ఇవి ఫ్రీ రాడికల్స్ వలన కలిగే అనారోగ్యాలను (ఉదా : క్యాన్సర్) దూరం చేస్తాయి. ఆక్సిడేషన్ వలన వచ్చే నష్టం నుంచి కణాలను రక్షిస్తాయి. హార్వర్డ్ టి.హెచ్. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నివేదిక ప్రకారం అధిక ‘యాంటీ ఆక్సిడెంట్స్’ తీసుకోవడం వలన క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధుల ప్రభావం తగ్గింది.
ఉదా : డార్క్ చాక్లెట్, బచ్చలికూర, బ్లూబెర్రీస్, బ్రోకలి, లవంగాలు, దాల్చిన చెక్క, పసుపు.
సిట్రస్ పండ్లు : విటమిన్ సి ఎక్కువగా వుండే అద్భుత ఫలాలు… నారింజ, నిమ్మ, ఉసిరి. వీటిలో ఆంటీ ఆక్సిడెంట్స్ అధిక మోతాదులో వుంటాయి.
ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇవి ఎముకలు, దంత ఆరోగ్యానికి, పెరుగుదలకు ఎంతో అవసరం. ఇది ఐరన్ శోషణలో ముఖ్యపాత్ర వహిస్తుంది.
అల్లం, వెల్లుల్లి : ప్రతి సీజన్‌లో ఇవి తినడం చాలా ముఖ్యం. ఇవి అద్భుత మూలికలు. అల్లం, వెల్లుల్లికి యాంటీ వైరల్ గుణాలు చాలా ఎక్కువ. వీటిని సూపుల్లో, పచ్చళ్లలో వినియోగించాలి. గొంతు నొప్పి వున్నప్పుడు అల్లం టీ తీసుకోవడం చాలా మంచిది. అల్లం మంచి ఆంటీ బయాటిక్. యాంటీ ఇన్ఫమేటరీ గుణాలను కలిగి వుంటుంది.
పసుపు : పసుపులో ‘కర్కుమిన్’ వుంటుంది. ఇది ఆంటీ ఆక్సిడెంట్. ఆంటీ మైక్రోబియల్ ప్రభావాలను కలిగి వుంటుంది. ఇది గ్యాస్ట్రిక్ అల్సర్లను నివారిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు యాంటీ మలేరియా ఏజెంట్‌గా పనిచేస్తుంది. అరస్పూన్ పసుపును పాలు/ తేనె/ వేడి నీటిలో వేసుకుని తాగితే మంచిది.
ఒమేగా ప్యాటీ ఆమ్లాలు : ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అత్యుత్తమమైన పోషక పదార్థాలు. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వర్షాకాలంలో ఆహారం, నీరు ద్వారా ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే ప్రమాదం వుంది. ఇవి చేపలు, రొయ్యలు, గుల్లలు, గింజలు, వాల్‌నట్స్, పిస్తాపప్పు, చియా గింజలు, అవిశగింజలు, హిమాలయాల్లో దొరికే సీబర్‌ధర్న్ బెర్రీస్‌లలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి.
– పి.వాణి, 9959361180