వైన్‌షాపుల్లో అపరిశుభ్రతపై ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఆగ్రహం

– రెండు రోజుల్లో పద్దతి మారకుంటే కఠినచర్యలు
– జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మణ్‌నాయక్‌
నవతెలంగాణ-ఆత్మకూర్‌
వైన్‌షాపు పరిసరాల్లో అపరిశుభ్రతతో దుర్గంధం వెదజల్లుతుండడం పట్ల పరిసరాలను పరిశీలించిన ఎక్సైజ్‌ సూపర్డెంట్‌ లక్ష్మణ్‌ నాయక్‌ వైన్స్‌ యజమానులపై మండిపడ్డారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని భద్రుక వైన్స్‌ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.చుట్టు పరిసరాలను పరిశీలించి గోదాములో సరుకుతో పాటు రికార్డులను పరిశీలించారు. పరిసరాలు చెత్తాచెదారం,కాళీ సీసాలతో కుప్పలుగా పోసిన వాటిని పరిశీలించిన ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మణ్‌ నాయక్‌ వైన్స్‌ ఆవరణలో విపరీతమైన దుర్గంధం వెదజల్లడంతో బ్రాండ్‌ షాప్‌ యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పక్కనే ఉన్న మూత్రశాలను పరిశీలించి ఎందుకు శుభ్రం చేయడం లేదని బ్రాండ్‌ షాప్‌ యజమానులను ప్రశ్నించారు. వెంటనే దుర్వాసన వస్తున్న మూత్రశాలను శుభ్రం చేసి చెత్తాచెదారాన్ని తొలగించి,కాళీ సీసాలు లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని.. లేకుంటే కఠిన చర్యలతొ పాటు కేసులు తప్పవని ఘాటుగా హెచ్చరించారు.ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎంతటి వారైనా వ్యతిరేకిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది బ్రాండ్‌ షాపా..లేక చెత్త కుప్ప అంటూ బ్రాండ్‌ షాప్‌ యజమానులను నిలదీశాడు.మళ్లీ రెండు రోజులకు వస్తా శుభ్రం చేయకుంటే కేసులు తప్పవని ఘాటుగా హెచ్చరించారు. గోదాములోని సరుకును పరిశీలించి రికార్డులను తనికీలు చేశారు. ప్రభుత్వ నిబంధన ప్రకారమే మద్యాన్ని అమ్మకాలు జరపాలని నిబంధనలకు వ్యతిరేకంగా పాల్పడితే కేసులు తప్పవన్నారు. వీరితో పాటు పరకాల ఎక్సైజ్‌ సీఐ జగన్నాధ రావు,ఎక్సైజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.