కాంగ్రెస్ ని ఆదరించండి భూపతిరెడ్డిని గెలిపించండి

నవతెలంగాణ మోపాల్: మోపాల్ మండలంలోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రభుత్వ ఏర్పడిన తర్వాత తన తొలి క్యాబినెట్ నుంచే ఆమోదముద్ర వేస్తుందని, ముఖ్యంగా దాదాపు పది సంవత్సరాల నుండి మోపాల్ మండలం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఇక్కడున్న ఎమ్మెల్యే మోపాల్ మండల్ నీ అస్సలు పట్టించుకోలేదని ఇప్పటికీ మండల్ ఏర్పాటు అయినప్పటి నుండి ఒక్క ప్రభుత్వ ఆఫీసు కూడా నిర్మాణం చేపట్టలేదని, ఇప్పటికైనా మనమందరం ఆలోచించి రూరల్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కెల్లా మన మోపాల్ మండలం అత్యధిక మెజార్టీతో డాక్టర్ భూపతి రెడ్డిని గెలిపించుకోవాలని, వచ్చేది మన ప్రభుత్వమని కర్షక ప్రభుత్వమని రైతు ప్రభుత్వం అని తెలిపారు. అలాగే డాక్టర్ భూపతి రెడ్డి గారు సౌమ్యుడని మంచి వ్యక్తుడని తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకపాత్ర పోషించిన గొప్ప వ్యక్తి అని చదువుకున్న వ్యక్తి వైద్యుడు అటువంటి వ్యక్తి మన కోసం తన వైద్య వృత్తిని కూడా వదులుకొని కేవలం మన రూరల్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోటే వచ్చాడని ఆయన ఇటువంటి స్వార్థం లేదని కేవలం ప్రజలకు సేవ చేయడమే ఆయన స్వార్థమని అటువంటి మంచి వ్యక్తిని మనం కచ్చితంగా గెలిపించుకొని తీరాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా మంచిప్ప గ్రామం తో పాటు శివారులో ఉన్న తండాలందరికీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే శుభవార్త వింటామని మన భూములు మన నివాస స్థలాలు ఎక్కడికి పోవని వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి మనం ఇక్కడే ఉంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మోపాల్ మండల అధ్యక్షుడు సాయి రెడ్డి తదితర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.