ఆదరించండి.. ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తాం

ఆదరించండి.. ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తాం – మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ జహీరాబాద్‌
అన్ని వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యం గత తొమ్మిది సంవత్సరాలలో అందరికీ అన్ని విధాల అభివద్ధికి కషి చేయడం జరిగిందని, మళ్లీ ఆదరిస్తే ఇంకా అభివృద్ధి చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జహీరాబాద్‌ పట్టణంలోని వివిధ కళ్యాణ మండపాలలో వివిధ కుల సంఘాలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సిద్దిపేటతో సమానంగా జహీరాబాద్‌ ను కూడా అభివద్ధి చేశాం ఇది జహీరాబాద్‌ వాసులకు తెలుసని అన్నారు. కేవలం ఎన్నికల కోసం వచ్చినటువంటి వారికి అభివద్ధి ఎలా తెలుస్తుంది స్థానికంగా ఉండే వారికే తెలుస్తుందని అన్నారు. జహీరాబాద్‌ పట్టణంలోని బసవ మండపం షట్కార్‌ కళ్యాణ మండపం అతిథి హౌటల్లో నిర్వహించిన టువంటి వివిధ సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని వారి సంక్షేమానికి తీసుకుంటున్నటువంటి అభివద్ధి కార్యక్రమాలను వివరించారు వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్‌ శాసనసభ్యునిగా మాణిక రాములు భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్‌ ఎమ్మెల్యే మాణికరావు టీఎస్‌ఐడిసి చైర్మన్‌ మహమ్మద్‌ తన్వీర్‌ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరోత్తం డిసిఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌ మాజీ మున్సిపల్‌ చైర్మన్లు మహంకాళి శుభాష్‌ గుప్తా, అల్లాడి నర్సింలు, ముత్యాల లావణ్య చందు ,షబానా తంజీం లతోపాటు నాయకులు మంజుల సరస్వతి రెడ్డి ,షీలా రమేష్‌, మాణిక్యమ్మ, ఉమాకాంత్‌ పాటిల్‌ దిశెట్టి పాటిల్‌ భాస్కర్‌ అరుణ మోహన్‌ రెడ్డి కిషన్‌ పవర్‌ పాల్గొన్నారు.
సీఎం బహిరంగ సభ స్థల పరిశీలన
ఈనెల 23న జహీరాబాద్‌ పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభ ఉన్నందున వివిధ ప్రాంతాల్లో సభ ఏర్పాట్లకు మంత్రి స్థల పరిశీలన చేశారు.
బీఆర్‌ఎస్‌ అంటే నమ్మకం.. కాంగ్రెస్‌ అంటే నాటకం
నవతెలంగాణ – పటాన్‌ చెరు
ఒక్కసారి అవకాశం ఇవ్వమంటున్న కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ప్రజలు 11 సార్లు అధికారం ఇచ్చారని ప్రజలకు ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌కు సవాల్‌ విసిరారు. గురువారం రాత్రి మండలంలోని ఇస్నాపూర్‌ చౌరస్తాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. పలు గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు వార్డు సభ్యులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు కాదని ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి మారుతాడని ఎద్దేవా చేశాడు.కాంగ్రెస్‌ పార్టీ హయాంలో దోపిడీలు మతకలోహాలు, పేకాట, గుడుంబా, జూదం విచ్చలవిడిగా నడిచేవని కెసిఆర్‌ ప్రభుత్వం వచ్చాక అవన్నీ మూతబడి సుఖసంతోషాలతో ఉన్నారన్నారు. పోరాడితేనే తెలంగాణ వచ్చిందని కాంగ్రెస్‌ పార్టీ దయతో రాలేదన్నారు. ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకునే సంస్కతి కాంగ్రెస్‌ పార్టీదని అది చూడలేకనే గాలి అనిల్‌ కుమార్‌ తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారన్నారు.మినీ ఇండియా గా పేరెందున పటాన్‌ చెరు నియోజకవర్గ ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే నాయకుడు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి అన్నారు.ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ప్రజల కోసం పనిచేసే నాయకుడు మీ ఎమ్మెల్యే అన్నారు. కులం మతం ప్రాంతం తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కషి చేస్తోందని పేర్కొన్నారు.కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకుంటే ఇక మిగిలేది అంధకారమేనని ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో హ్యాట్రిక్‌ సీఎం కేసీఆర్‌ అని పటాన్చెరు ఎమ్మెల్యేగా ముచ్చటగా మూడోసారి మహిపాల్‌ రెడ్డి అన్నారు.
నవ తెలంగాణ కోహిర్‌
కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలకు గ్యారెంటీ లేదని రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి. హరీశ్‌ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బి ఆర్‌ ఎస్‌ జహీరాబాద్‌ అభ్యర్థి కొన్నింటి మాణిక్‌ రావు కు మద్దతుగా గురువారం కోహిర్‌ లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసగిస్తుందన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు వారికి గెలిచే గ్యారెంటీ లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్‌ , టీఎస్‌ ఐడీసీ చైర్మన్‌ తన్వీర్‌, ఎస్‌ఐ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరోత్తం , టిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింలు, నాయకులు రామకష్ణారెడ్డి , మాజీ సర్పంచ్‌ కలీం తదితరులు పాల్గొన్నారు.