సుప్రీంకోర్టు తీర్పు సామాజిక న్యాయానికి ప్రతిబింబం 

Supreme Court judgment is a reflection of social justice– బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును బహుజన లెఫ్ట్ పార్టీ- బి ఎల్ పి రాష్ట్ర కమిటి స్వాగతిస్తునట్లు బహుజన లెఫ్ట్ పార్టీ- బిఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని సుభాష్ నగర్ లో గల బహుజన లెఫ్ట్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ సోదరులు మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో చేసిన పోరాటాలకు  సుప్రీంకోర్టుతో ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగ ఉప కులాలకు భవిష్యత్తులో విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగంలో సామాజిక న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.అదేవిధంగా ఎస్టీ తెగలైన ఆదివాసీ, న్యాయకపోడు, ఎరుకల, లంబాడా తదితర ఎస్టీ గిరిజన తెగలకు రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయం అందుతుందని వెల్లడించారు. అయితే గత పది సంవత్సరాలుగా బిజెపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆధిపత్య ఆర్థిక విధానాల వల్ల ప్రభుత్వ రంగంలో రోజురోజుకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలు కోసం ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఉద్యమించాలని, అదేవిధంగా మాదిగ దండోరా ఉద్యమ అనుభవాల స్పూర్తితో బిసి కులాల ప్రజలు అన్ని రంగాల్లో సమాన వాటా కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత, ఉపాధ్యక్షులు కాంబ్లే మధు, సాయి కాంబ్లే, నగర ఉపాధ్యక్షులు టి.రాజులు పాల్గొన్నారు.