కుక్క పిల్లలకు యాంటీరాబిస్ టీకాలు వేస్తున్న ఆఫీస్ సబార్డినేట్ సురేష్ 

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్ 

మండలంలోని పశు వైద్య కేంద్రంలో గురువారం రోజున ప్రపంచ  జోనోసిస్ దినోత్సవంగా సందర్భంగా పెంపుడు జంతువులకు టీకాలు వేయించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ 1985 జూలై 6న రాబిస్ వ్యాక్సిన్ కనుగొనడంతో అప్పటినుండి ప్రపంచ జోనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. పశువుల నుంచి మనుషులకు మనుషుల నుంచి పశువులకు ప్రజల వ్యాధులను జోనోసిస్ వ్యాధులు అంటామని అన్నారు. ఈ వ్యాధులలో ప్రధానమైన వ్యాధి రాబిస్ వ్యాధి అని అన్నారు. పిచ్చికుక్కలు, నక్కలు, కోతులు, గబ్బిలాలు, పిల్లి మొదలైనవి కరవడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. దీని నివారణగాను పెంపుడు కుక్కలకు రాబిస్ వ్యాక్సిన్ వేయించాలని అన్నారు. ఒకవేళ కుక్కలు వగైరా కరిస్తే ఇంజక్షన్లు చేయించుకోవాలని అన్నారు. అదేవిధంగా ఇన్ఫెక్షన్లను నివారించడం కోసం పచ్చి పాలను తాగరాదని, పచ్చి కోడిగుడ్డును తినరాదని  సురేష్ తెలిపారు.