సౌత్ ఇండియా ఐకాన్ టీచర్ గా సూర్యాపేట వాసి..

నవతెలంగాణ -చివ్వేంల :- సౌత్ ఇండియా ఐకాన్ టీచర్ గా సూర్యాపేట వాసికి అరుదైన గౌరవం దక్కింది. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని  గుంటూరులోని  నెక్స్ట్ జనరేషన్ ఇంటర్నేషనల్ హైస్కూల్లో  సౌత్ ఇండియా ఐకాన్ టీచర్ అవార్డు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా సూర్యాపేట పట్టణం లోని నవోదయ మాంటిస్సోరి హై స్కూల్ లో హిందీ అధ్యాపకులు గా  పని చేస్తున్న దేవేందర్ కు సౌత్ ఇండియా ఐకాన్ టీచర్ అవార్డు అందుకున్నారు.దేవేందర్ కు సౌత్ ఇండియా ఐకాన్ అవార్డు రావడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..