నవతెలంగాణ- రామారెడ్డి : మండల కేంద్రంలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వంకలవాడి సంజీవ్ (33) దుర్గ వైన్స్ లో విస్కీ కొనుగోలు చేసి, పక్కనే గల పర్మిట్ రూంలో విస్కీ త్రాగుతూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని, మృతుడి అన్న మారుతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.