మండలంలో స్వచ్ఛ సర్వేక్షన్ బృందం పర్యటన..

నవతెలంగాణ – దండేపల్లి: స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ 2023లో భాగంగా  కార్యక్రమంలో భాగంగా శనివారం దండేపల్లి మండలంలోని మేదరిపేట, తాల్లపెట్, నాగదముద్రం, నాంబాల, గూడెం గ్రామాలలో గ్రామపంచాయతీ స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. మండల నాయకులు, అధికారులు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బృంద సభ్యులు ఆయా పంచాయతీల పరిధిలోని పారిశుద్ధ్యం, వార సంత నిర్వహణ, అంగన్వాడి కేంద్రాలు, డ్రైనేజీ డంపింగ్ యార్డ్, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటి సమీక్షించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షన్ బృంద సభ్యులు గాండ్ల సునీల్ కుమార్, సునీల్ గౌడ్, నవీన్, రాకేష్  ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.