హెల్త్ క్యాంప్ పోస్టర్ల ఆవిష్కరణ..

నవతెలంగాణ – దండేపల్లి:  మంచిర్యాలకు చెందిన శ్రీహర్ష విద్యా సంస్థల అధినేత, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భుమేష్ శ్రీ హర్ష డిగ్రీ కాలేజీలో నిర్వహించబోయే హెల్త్ క్యాంప్ కునకు సంబంధించిన గోడప్రతులను మండలంలోని తాళ్లపేటలో స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచిర్యాలలోని మెడిలైఫ్, హైదరాబాద్ కు చెందిన కిమ్స్, సన్ సైన్ హాస్పిటల్ వారి సహకారంతో శ్రీహర్ష డిగ్రీ కాలేజీ నందు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని మండల ప్రజలు ఈ ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తారని అన్నారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు క్యాంపు నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, నాయకులు ఇప్ప రమేష్, జనార్ధన్, స్థానికులు పాల్గొన్నారు.
Spread the love