స్వచ్ఛంద సేవ పేరుతో రూ.35 కోట్లు స్వాహా

– నిందితుడిని అరెస్టు చేసిన సీఐడీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
స్వచ్ఛంద సేవ పేరిట దాతల నుంచి రూ.35 కోట్లను సేకరించి స్వాహా చేసి పరారైన నిందితుడిని సీఐడీ అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. సీఐడీ డీజీ మహేశ్‌ భగవత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట్‌ కు చెందిన ఉమాకాంత్‌ ఆధ్యాత్మిక రంగంలో తాను పని చేస్తున్నానని అందులో భాగంగా గోశాలలను నిర్వ హించటం, వృద్ధాశ్రమాలను నడిపిం చటం, ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపా లను నిర్వహిస్తున్నానని దాతల నుం చి నిధులను సేకరించాడు. ముఖ్యం గా, ఆస్మాన్‌గఢ్‌కు చెందిన శివప్రసాద్‌ తో పాటు మరికొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి రూ.35 కోట్ల మేరకు విరాళాలు సేకరించాడు. కాగా, అతను ఏ మేరకు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే శివప్రసాద్‌ ఆరా తీయగా.. ఉమాకాంత్‌ చెప్తున్నదంతా వట్టిదేననీ, తమ వద్ద నుంచి వసూలు చేసిన విరాళాలను దారి మళ్లించి వేరే పనులకు ఉపయోగించుకున్నాడని తేలింది. దీనితో శివప్రసాద్‌ 2020లో ఉమాకాంత్‌ చేసిన మోసంపై చైతన్యపురి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును తర్వాత దర్యాప్తు నిమిత్తం నగర సీసీఎస్‌కు బదిలీ చేశారు. అదే ఏడాది ఈ కేసును దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు నిందితుడు ఉమాకాంత్‌ కోసం గాలించగా.. పరారీలో ఉన్నట్టు తేలింది. తాజాగా, సోమవారం కొంపెల్లిలో తలదాచుకున్న ఉమాకాంత్‌ను సీఐడీ నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసిన టీం పోలీసులు అరెస్టు చేశారు.