మెప్మా ఆర్పి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా స్వర్ణలత

నవతెలంగాణ – కంటేశ్వర్
బిఆర్టియు మెప్మా ఆర్పీల రాష్ట్ర ఉపాధ్యక్షులుగా దొండి స్వర్ణలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం హైదరాబాద్ లోని టిఆర్ఎస్కెవి భవన్ లో యూనియన్ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్, రాష్ట్ర అధ్యక్షురాలు మానుకోట సునీత, ప్రధాన కార్యదర్శి శ్రీమతి, కోశాధికారి జహేరా, యూనియన్ సభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దొండి స్వర్ణలతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అరుణోదయ రిసోర్స్ పర్సన్స్ జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్న స్వర్ణలతకు, బిఆర్టియు మెప్మా ఆర్పీల ఉపాధ్యక్షులుగా నియమించడం పట్ల, రాష్ట్ర కమిటీకి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానని స్వర్ణలత వెల్లడించారు. మెప్మా అర్పిల రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన స్వర్ణను పలువురు అరుణోదయ రిసోర్స్ పర్సన్స్ ఓబి ల అధ్వర్యంలో అందరూ ఆర్పీ లు కలిసి యూనియన్ అధ్యక్షురాలు ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు స్వర్ణలత, కార్యదర్శి స్వర్ణలత,కోశాధికారి స్వప్న, ఉపాధ్యక్షురాలు మంజుల,సహాయ కార్యదర్శి జ్యోతి,ఆర్పీలు నాగమణి,సుమలత, సరోజ, సుజాత ,హరిత, తదితర ఆర్ పి లు పాల్గొన్నారు.