తడారని కనుపాపల్లో
నిదుర మొలకలు మొలకెత్తవు
కునుకే ఎరుగని కనులలో
కలల పుష్పాలు పూయవు
గుబులు మదిగూటిలోని
దిగులు పిట్టలు జోలపాటలు పాడవు
పల్లవించిన చరణం కరుణించకున్నా
మౌనగీతమైన ఆలపించి
మనస్సును ఊరడించాలి
కమ్మటి కలలు వరమయ్యే వరకూ !
– సురేంద్ర రొడ్డ, 9491523570