అన్ని గ్రామాలలో ఎలక్షన్ కోడ్ పాటించాలి తాసిల్దార్ కలీం

నవ తెలంగాణ-జక్రాన్ పల్లి :

మండలంలోని అన్ని గ్రామాలలో ఎలక్షన్ కోడ్ పాటించాలని తాసిల్దార్ కలీం గురువారం అన్నారు. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. అన్ని గ్రామాలలో వివిధ పార్టీల బ్యానర్లను తొలగించాలని, గ్రామంలోని ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేట్ స్థలాల్లో రాజకీయ పార్టీల ప్రచారాన్ని తుడిచి వేయాలని పేర్కొన్నారు. గ్రామాలలో రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడిగించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ సీనియర్ అసిస్టెంట్ గోపాల్ జూనియర్ అసిస్టెంట్ నవీన్ అన్ని గ్రామాల బి ఎల్వోలు తదితరులు పాల్గొన్నారు