జీలుగు విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి..

నవతెలంగాణ – నవీపేట్: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సురేష్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలు తెలిపారు. నవీపేట్, బినోల సొసైటీ పరిధిలోని రైతులకు 24వ తేదీ నుండి ఉదయం 10 గంటల నుండి జీలుగు విత్తనాలను 30 కిలోల బస్తాకు 842.70 రూపాయలకు అందించడం జరుగుతుందని అన్నారు.