
నవతెలంగాణ -డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని చంద్రయాన్ పల్లి గ్రామంలో పశువుల కు గాలికి వచ్చే వైరస్ వ్యాది గాలి కుంటు నివారణ మందులు, నట్టల మందులు వేసి పశువులను ట్యాగ్ వేసినట్లు ఇందల్ వాయి మండల పశువైద్యది కారి గంగా ప్రసాద్ మంగళవారం తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పశువులు వ్యాధి లో బారిన పడకుండా ఉండటానికి లక్షలు, కోట్లు వేచ్చించి ఉచితంగా మందులను పంపిణీ చేస్తుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లలిత దాస్, ఉప సర్పంచ్ ప్రకాష్,సినియర్ నాయకులు అరటి రఘు, సంజీవ్ రెడ్డి,విడిసి అధ్యక్షులు పొన్న బుమయ్య, దేవగౌడ్ ,కిష్టయ్య, మురళి, ఆశన్న, మల్లయ్య, పెద్ద బాలయ్య, నర్సయ్య, శ్రీధర్ తోపాటు తదితరులు పాల్గొన్నారు