సీజనల్‌ వ్యాధులపై ముందస్తు చర్యలు తీసుకోండి

– గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలి
– జడ్పీ నిధులతో గ్రామాల అభివృద్ధి
– స్థాయి సంఘాల సమావేశాల్లో జడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతారెడ్డి
నవతెలంగాణ వికారాబాద్‌ ప్రతినిధి
సీజనల్‌ వ్యాధులపై ముందస్తు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచాల ని వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల పనితీరునుపై శాఖల వారిగా గురువారం ఆమె సమీక్షా నిర్వహించారు. జడ్పీ నిధులతో గ్రామాల్లో చేపట్టిన పనులతో పాటు, వివిధ శాఖల పని తీరుపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వ హించారు. ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణాభి వృద్ధి, రహదారులు, విద్య, వైద్యం, గ్రామీ ణ నీటి సరఫరా, పారిశుధ్యం, జాతీయ ఉపాధి హామీ పనులు, విద్యుత్‌, గ్రామీణ అభివృద్ధి, తదితర అంశాలలో ఇప్పటివరకు జరిగిన పురోగతి, కొత్తగా ప్రతిపాదించిన పను ల వివరాలపై సంబంధిత అధికారులతో చర్చించా రు. ఏడు స్థాయీ సంఘాల సమావేశాలు ఆయా సంఘాల ఛైర్‌పర్సన్ల అధ్యక్షతన జరిగాయి. వ్యవసాయం, విద్యా వె ౖద్యం, గ్రామీణ అభివృద్ధి, పనులు, ఫైనాన్స్‌, సాంఘీక సంక్షే మం, మహిళాశిశు సంక్షేమం స్థాయి సంఘాలపై విస్తృతం గా సమీక్ష జరిపారు. వర్షాలు ఆలస్యంగా వచ్చాయని కాల పరిధి తక్కువలో పంటలు వచ్చే సీడ్స్‌ వేసుకునేలా రైతులకు సూచించాలని వ్యవసాయ స్థాయి సంఘం చైర్మన్‌ విజరు కుమార్‌ సూచించారు. ఈ సారి పదవ తరగతిలో జిల్లా చిట్ట చివరి స్థానంలో నిలిచిందని వచ్చే సారి ఇలా జరుగకుండా ఇప్పటి నుంచే ప్రణాళిక బద్దంగా విద్యాబోధన జరగాలని సునీతారెడ్డి సూచించారు. వర్షాకాలం ప్రారంభం అయినం దున సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని అన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన పోషక ఆహారం అందాలని సూచించారు. గర్భిణులు భలవర్ధకమైన ఆహారం తీసుకునేలా వారికి సూచనలు ఇవ్వాలని, న్యూట్రీష న్‌ కిట్లు అందించాలన్నారు. లక్ష్యం మేర మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించే బాధ్యత కూడా శాఖల వారిగా తీసుకోవా లని సూచించారు. రూర్బన్‌ కిందా జిల్లా కేంద్రంలో రూ. రెండు కోట్లతో ప్రారంభమైన ఆడిటోరియం పనులు, అలాగే టీఎస్‌ఈడబ్ల్యూ ఐడిసీ కిందా మరో రూ.రెండు కోట్లతో చేపట్టిన స్టేడియం పనులు ఎందుకు ఆగిపోయాయని అధికారుల ను ప్రశ్నించారు. గుత్తేదారును మార్చి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకు ముందు మహిళాశిశు, సాంఘీక సంక్షేమ శాఖలపై ఆ సం ఘాల అధ్యక్షతన సమీక్ష చేశారు. సాంఘిక, గిరిజన సంక్షేమం, వెనుకబడిన తరగతులు, మైనారిటీ, యువజన సర్వీసులు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ విభాగాల్లో అమలవుతు న్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. అనంతరం సునీతారెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం తో వ్యవహరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకా లను అమలు చేయాలన్నారు. రానున్న స్థాయి సంఘాల సమా వేశానికి వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికా రులు తప్పనిసరిగా హాజరుకావాలని అధికారులకు అదేశిం చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ స్థాయీ సంఘం ఛైర్మన్‌ విజరుకుమార్‌, సాంఘీక సంక్షేమ స్థాయి సంఘం చైర్‌ పర్సన్‌ అరుణదేశ్‌, మహిళా శిశు సంక్షేమ స్థాయి సం ఘం చైర పర్సన్‌ సుజాత, జడ్పీ ఇన్‌చార్జి సీఈఓ సుభాషిణి, జడ్పీిటీసీ సభ్యులు నాగిరెడ్డి, ధారాసింగ్‌, రాందాస్‌, హరిప్రి య, మేఘమాల, జిల్లా అధికారులు పాల్గొన్నారు.