కళాశ్రీ గోవింద్ గురు యూనివర్సిటీ లో టీయూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ప్రతిభ…

నవతెలంగాణ- డిచ్ పల్లి:  గుజరాత్ రాష్ట్రంలోని గోద్రాలో కళా శ్రీ గోవింద్ గురూ యూనివర్సిటీ లో ఈనెల 1వ నుండి 8 వరకు  నిర్వహిస్తున్న జాతీయ సమైక్య శిబిరంలో తెలంగాణ యూనివర్సిటీ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు ప్రతిభ పాటవాలు ప్రదర్శించారని యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ కే రవీందర్ రెడ్డి బుధవారం తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు ప్రదర్శించిన బంజారా సాంప్రదాయ నాట్యానికి సంస్కృతిక కార్యక్రమాలలో ద్వితీయ  బహుమతి పొందినారు. స్వాగత కార్యక్రమంలో  కార్తీక్ నాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ నుండి ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు బావి భారత దేశము -యువత పాత్ర, మానవ వనరుల వినియోగం  పర్యావరణం వంటి అంశాలపై ఉపన్యసించారు. ఈ కార్యక్రమం వలన విద్యార్థుల్లో జాతీయ భావం భిన్నత్వంలో ఏకత్వం భారతీయ కళలు, భాష, సాంప్రదాయాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడిందని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సరిత  తెలిపారు.  ఈ కార్యక్రమంలో శ్రీ కుబేర్ డెండోర్, విద్యాశాఖ మంత్రి ఆచార్య ప్రతాప్ సిన్వా చోహన్ వైస్ ఛాన్స్లర్  ( జిజియు ) పాల్గొన్నారు.