పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

– పదిమంది అరెస్ట్

– బాధ్యతలు తీసుకున్న అనంతరం పోలీస్ కమిషనర్ ఆదేశాలతో భారీగా నగదు పట్టివేత

నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా శుక్రవారం రాత్రి బాధ్యతలు తీసుకున్న కొద్దిసేపటికే నిజామాబాదు నగర శివారులోని మాణిక్ బండారు పరిసర ప్రాంతంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పదిమంది పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సిపి కమలేశ్వర్ ఆదేశాలతో, టాస్క్ ఫోర్స్ ఏసిపి రాజశేఖర్ రాజు, ఆధ్వర్యంలో, సిఐ అజయ్, అంజయ్య లు మాణిక్ బండార్ శివారులోని ఓ గెస్ట్ హౌస్ లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పదిమంది పేకాట రాయుళ్ల ను అదుపులోకి తీసుకోగా, వారి నుంచి  6,55,400/- రూపాయల నగదును స్వాధీన పరుచుకున్నారు. అనంతరం వీరిని సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు.