
నవతెలంగాణ – స్టేషన్ ఘన్ పూర్
స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గంలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు ఇటీవలే 119 నియోజక వర్గాలకు గానూ, ఒకేసారి 115నియోజక వర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ల ప్రకటనలో ఏడు నియోజక వర్గాల్లో మాత్రం సిట్టింగుల మార్పు తెలిసిందే… స్టేషన్ ఘన్ పూర్ లో ఎమ్మెల్యే డా తాటికొండ రాజయ్యకు బదులు ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటి సారి కడియం నియోజక వర్గానికి రాగా, ఎమ్మెల్యే రాజయ్య మాత్రం హాజరు కాలేదు. కేసీఆర్ పంపిన దూతగా రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వీరిద్దరిని
సమన్వయం చేసి, విభేదాలను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా బుధవారం ‘పల్లా ‘ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి వెళ్లిన ఆయన లేకపోవడం, వచ్చినట్లు సమాచారం వచ్చిన తాటికొండ రాజయ్య కలువకపోవడం రాజకీయ వర్గంలో చర్చకు దారితీసింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం ఫలించకపోతే హైదరాబాద్ స్థాయిలో ఇద్దరు నేతలను పిలిచి వారి మధ్య సమన్వయం కుదిర్చి, ఎన్నికలను సమిష్టిగా ఎదుర్కొనేలా మార్గదర్శకత్వం చేసి పంపించే అవకాశాలున్నాయనే సమాచారం.
ఇదిలావుంటే
ఇదిలావుంటే
ఎమ్మెల్యే డా. రాజయ్య అధికార కార్యక్రమంలో సజావుగా పాల్గొని, తన వర్గీయులకు కంటికి రెప్పలా కాపాడుకోవల్సిన బాధ్యత తనపై ఉందని, ఎవ్వరూ అధైర్యపడవద్దని, అక్కడ కేసీఆర్, ఇక్కడ నేను… ఉండి అధినేత అందించే ప్రతీ ఫలం ప్రజలకు అందిస్తానని అంటున్నారు. తన పర్యటనలో భాగంగా శుక్రవారం స్టేషన్ ఘన్ పూర్ నియోజక వర్గం ధర్మసాగర్ మండలంలో బీసీ కుల వృత్తుల లబ్ది దారుల చెక్కుల పంపిణీ వ్యాఖ్యలు చేసారు. ఆరు నూరైనా ప్రాణం అడ్డేసైనా…మీ అందరిని కాపాడుకుంటానని, చెట్టుకు కాయలు కాస్తేనే దెబ్బలు అధికంగా తగులుతాయని, రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఉండి తీరుతానని స్పష్టం చేశారు. భూమి కొని, మొట్లు కొట్టి, ముళ్ళు ఏరి, దుక్కి దున్ని, నీళ్లు పోసి, నారు పోసి, కలుపు తీసి, కుప్పగొట్టి, రాసిపెట్టి హవ్వా… ఎక్కడన్నా ఉన్నదా…పంట ఎండినప్పుడో .. నీళ్ళు లేనప్పుడో సాయం చేయకుండా పంట పండించి ఇప్పుడు ఎవరో వచ్చి కుప్ప మీద కూర్చుంటే ఊరుకుంటానా..?అని వ్యాఖ్యానించారు. మనకు దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నాడని, రేపు మాపో మనం అనుకున్న కార్యక్రమం జరగబోతుందని మీకోసం నేనుంటా ప్రాణమిస్తా… మీ మధ్యలో చచ్చిపోతా ప్రజల కోసమే నేనున్నాని అన్నారు.