17న టెడ్‌ఎక్స్‌ ఇగ్నైట్‌ సదస్సు

హైదరాబాద్‌ : టెడ్‌ఎక్స్‌ హైదరాబాద్‌ తన 9వ ఎడిషన్‌ను సెప్టెంబర్‌ 17న నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫైనాన్సీయల్‌ డిస్ట్రిక్‌లోని ప్రధాన్‌ కన్వెన్షన్స్‌లో ఈ ఇగ్నైట్‌ సదస్సు జరగనుందని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. నిపుణులైన 12 మంది స్పీకర్లు హాజరు కానున్నారని పేర్కొన్నారు. వివిధ రంగాలలో సానుకూల మార్పును ప్రేరేపించటం తాము లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకర్షణీయమైన చర్చలు, ఇంట రాక్టివ్‌ సెషన్‌లు, హాజరైనవారు స్పీకర్‌లతో చర్చించటం, అర్ధవంతమైన సం బంధాలు, సహకారాన్ని పెంపొందించే అవకాశాలుంటాయని పేర్కొన్నారు.