ఎంఆర్‌ఎఫ్‌ నుంచి స్టీల్‌ బ్రేస్‌ రేడియల్‌ టైర్లు

Steel brace radial tires from MRFచెన్నయ్ : ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్‌ఎఫ్‌ హై ఎండ్‌ బైక్స్‌ కోసం ప్రత్యేకంగా స్టీల్‌ బ్రేస్‌ రేడియల్‌ టైర్లను ప్రవేశపెట్టినట్టు వెల్లడించింది. వీటిని అత్యధిక పనితీరు కలిగిన మోటారు సైకిల్స్‌ కోసం రూపొందించినట్టు పేర్కొంది. స్టీల్‌ బ్రేస్‌ రేడియల్స్‌ అనేవి అత్యంత ప్రత్యేకమైన టైర్లని.. తీవ్ర పరిస్థితుల్లో అసాధారణ పనితీరు కనబర్చుతాయని వెల్లడించింది. రేసింగ్‌ డిమాండ్లన దృష్టిలో పెట్టుకుని.. అవి వంపులు తిరిగేచోట విశాలమైన కాంటాక్ట్‌ ప్యాచ్‌తో తగినంతపట్టును కలిగి ఉంటాయని పేర్కొంది.