నవతెలంగాణ- కోటగిరి: కోటగిరి మండల కేంద్రంలో కోటగిరి ప్రాథమిక సహకార సంఘం పరిధిలోని వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం స్థానిక తహసిల్దార్ ప్రభాకర్ ప్రారంభించారు 100 కిలోల ఏ గ్రేడ్ ధాన్యానికి 2203 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2183 రూపాయలు ప్రభుత్వం కొనుగోలు చేసిన వారం రోజులు లోపు రైతులకు అందజేస్తుందని ఈ అవకాశం రైతులు ఉపయోగించుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.