రైతులను ఇబ్బందులను గురి చేస్తే చర్యలు తహసీల్దార్‌ వహీదా ఖాతుమ్‌

నవతెలంగాణ-వికారాబాద్‌ డెస్క్‌
వరి ధాన్యం కొనుగోలు కేంద్రలలో రైతులను ఇబ్బందులు గురి చేస్తే చర్యలు తప్పవని తహసీల్దార్‌ వహీదా ఖాతుమ్‌ అన్నారు. గురువారం దోమ మండల పరిధిలోని గుండాల్‌, దాదాపుర్‌ ఆయా గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు సెంటర్‌లో ప్రతి రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. మ్యాచర్‌ మిషన్‌ ని పరిశీలించి మరియు వేటియింగ్‌ మిషన్‌ పరిశీలించి, హమాలీలకు రైతులకు మంచినీటి సౌకర్యం అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయనీ, కాబట్టి నీళ్లు అందుబాటులో ఉండాలని సిబ్బందికీ సూచించారు. రైతులను తేమ పేరుతో, తూకాలలో మోసలకు గురి చేస్తే చట్టప్రకారం సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ లింగం తదితరులు పాల్గొన్నారు.