31న తెలంగాణ బ్రాహ్మణ సదన్‌ ప్రారంభం

– పాల్గొననున్న సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ బ్రాహ్మణ సదన్‌ భవనాన్ని ఈనెల 31న ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌ గోపనపల్లిలో తొమ్మిదె కరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం పూర్తిచేసుకుంది. దీనిపై సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రారంభోత్సవం సందర్భం గా చండీయాగం, సుదర్శనయాగం నిర్వహించాలనీ, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే బ్రాహ్మణ సంఘాల నాయకులు, పీఠాధిపతులు, అర్చకులు, వేద పండితులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సమీక్షా సమావేశం లో బ్రాహ్మణ పరిషత్‌ అధ్యక్షులు డాక్టర్‌ కేవీ రమణాచారి, ఉపాధ్యక్షులు వనం జ్వాలా నరసింహారావు, సభ్యులు డాక్టర్‌ సముద్రాల వేణుగోపాలా చారి, కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, వీ మత్యుంజయ శర్మ, పురాణం సతీష్‌, మరుమాముల వెంకటరమణశర్మ, బోర్పట్ల హనుమంతా చారి, అష్టకాల రామ్మోహన్‌, భధ్రకాళి శేషు, సుమలతా శర్మ, సువర్ణ సులోచన, జోషి గోపాల శర్మ, పరిషత్‌ సభ్య కార్యదర్శి వి. అనిల్‌ కుమార్‌, పాలనాధికారి రఘు రామశర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లా డుతూ అర్చక, పౌరహిత్యమే జీవనాధారం చేసుకునే బ్రాహ్మణ సమాజాన్ని కాపాడుకోవాల్సిన భాధ్యత సభ్య సమాజం మీద వున్నదని అన్నారు.