11నుంచి తెలంగాణ రైతాంగ

– సాయుధ పోరాట వారోత్సవాలు : కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు సెప్టెంబర్‌ 11నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లాల్లో ఉన్న సాయుధ పోరాట కేంద్రాల్లో సీపీఐ ఆధ్వ ర్యంలో నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబ శివరావు శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. 17న ముగింపు వారోత్సవాల సందర్భంగా హైదరా బాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్త కార్య క్రమాల్లో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శులు పాల్గొంటారని తెలిపారు.