ఏషియన్‌ గేమ్స్‌లో ఎగిరిన తెలంగాణ జెండా

At the Asian Games Flying Telangana flag– రాష్ట్రానికి పతకాల పంట :
– ఇషా, నిఖత్‌ ,నందిని అద్బుత విజయాలు
హైదరాబాద్‌: ఏషియన్‌ గేమ్స్‌ లో వివిధ క్రీడా విభాగాల్లో తెలంగాణ ఆణిముత్యాలు సత్తా చాటి, రాష్ట్రం గర్వపడే విజయాలు సాధించారని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ హరర్షం వ్యక్తం చేశారు.సీఎం కేసీఆర్‌ గారి ప్రోత్సాహంతో చైనా వేదిక గా జరిగిన ఏషియన్‌ గేమ్స్‌ లో తెలంగాణ ప్రతిభకు పతకాల పంట స్వంత మారిందన్నారు.ఈ ముగ్గురి విజయం తెలంగాణ రాష్ట్ర యువత లో కొత్త ప్రేరణ కలిగించిందన్నారు.ఇషా,నిఖాత్‌,నందిని ల కు మొదటి నుంచి అన్ని విధాలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు అండగా నిలవడం వల్లే ఏషియన్‌ దేశాల ను వెనక్కి నెట్టేసి తెలంగాణ బంగారాలు విజేత లు గా నిలిచారని ఆనందం వ్యక్తం చేశారు.ప్రతిభ కలిగిన క్రీడా కారులకు సీఎం కెసిఆర్‌ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆంజనేయ గౌడ్‌ అన్నారు.