తెలంగాణ ఆడబిడ్డలు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను ప్రభుత్వానికి వీరి సమస్య పట్టదా ?

– రక్షాబంధన్  నడిరోడ్డుపై
– నోటిఫికేషన్ రద్దుచేసి, కాంట్రాక్ట్ ఏఎన్ఎం లను పర్మినెంట్ చేయాలి
– సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ -కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లాలో కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు అందరూ రక్షాబంధన్ సందర్భంగా కూడా నడిరోడ్డుపై  వచ్చే పోయే వారికి రాఖీ కడుతూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న గత 24 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు గ్రామాల్లో పనిచేస్తున్న నేటికీ పర్మనెంట్ చేయకపోవడం చాలా దుర్మార్గం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతి నెలలో అన్ని రకాల పనులు చేయిస్తూ కేసీఆర్ కిట్టు, ఆన్లైన్లో, ఐహెచ్ఐపి, డబ్లుహెచ్ సి,  అబాకర్స్, 32 రికార్డులను ఆన్లైన్ చేస్తూ 24 గంటల పని చేస్తూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టిన గ్రామస్థాయిలో అనేక ఇబ్బందులను ఓర్చుకొని రాష్ట్ర ప్రభుత్వానికి పేరు తెస్తూ కరోనా కష్టకాలంలో కూడా రెండు సంవత్సరాలు కష్టపడి ప్రాణాలకు తెగించి పనిచేసిన ప్రభుత్వం గుర్తించకపోవడం దుర్మార్గమని ఆమె అన్నారు. వారి యొక్క శ్రమను గుర్తించకుండా వారిని పర్మినెంట్ చేయకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. గ్రామాల్లో వ్యాక్సినేషన్, ఎన్ సి డి, పిఎన్సి  ల విసిట్, టిబి కేసులు, లెప్రసీ  ప్రతి నెల 100% కావాలని పై అధికారులు ఏఎన్ఎం పై ఒత్తిడి చేస్తూ నారు. ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొని పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం అని అన్నారు. తక్షణమే ఏఎన్ఎం లను పర్మినెంట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పండగ వారంతా సెలవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పుష్ప కవిత సావిత్రి  విజయ ప్రమీల లక్ష్మీ గగమని రాణి తదితరులు పాల్గొన్నారు.