కార్మికులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

 క్యాబ్‌ డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా కార్డులు అందజేత
:ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌
నవతెలంగాణ-అంబర్‌పేట
కార్మికులకు అండగా ప్రభుత్వం ఉంటుందని వారికి అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తానని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. ఆదివారం గోల్నాక డివి జన్‌ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబర్‌ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ క్యాంపు క్యాబ్‌ డ్రైవర్లకు గుర్తింపుతో కూడిన రూ. 5 లక్షల ప్రమాద బీమా కార్డులను అం దజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబర్‌ పేట నియోజకవర్గంలో నివసించే డ్రైవర్ల అందరికీ ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ రూ.5 లక్షల కవరేజీతో ఉచిత ప్రమాద బీమా ఆరు రకాల ప్రమా దాలకు వర్తి స్తుందని తెలిపారు. రోడ్డు యాక్సిడెంట్‌, నీటి ప్రమాదం, ఫైర్‌ ఆక్సిడెంట్‌, రైలు ప్రమాదం, పాము కాటు తేలుకాటు తది తర ప్రమాదాలకు వర్తిస్తుందన్నారు. అంబ ర్‌పేట నియోజకవర్గంలో నివసించే డ్రైవర్ల అందరూ విధి గా ప్రమాద బీమా కార్డులు పొందాలని, భవిష్యత్తులో డ్రైవ ర్ల సహజ మరణం పొందినా కూడా వర్తించే విధంగా లబ్ధి అందించాలని ముఖ్య మంత్రి కేసీఆర్‌ దష్టికి తీసుకెళ ా్తనని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ట్టీయు హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు పోలే నిరంజన్‌ క్యాబ్‌ డ్రైవర్స్‌ అసోసి యేషన్‌ అధ్యక్షులు కొమ్ము వీరస్వామి క్యాబ్‌ డ్రైవర్స్‌ అసోసియేషన్‌ పాలక మండలి కరు ణాకర్‌ నాయకులు, సభ్యులు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.