-నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ అభ్యర్థి మహ్మద్ ఆలీ షబ్బీర్
నవతెలంగాణ -కంటేశ్వర్: పదేళ్ల పాలనలో కేసీఆర్ తాగు బోతుల తెలంగాణ గా మార్చారని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ అభ్యర్థి మహ్మద్ ఆలీ షబ్బీర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినాయక్ నగర్ లోని రాజీవ్ గాంధీ విగ్రహం నుండి స్వాగత బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం నెహ్రు పార్క్ వద్ద రోడ్ షోలో షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇంట్లో అర్హులందరికీ ఆసరా పింఛన్లు 6 గ్యారంటీ లనుప్రజాల్లోకి తీసుకు వెళ్తున్నామన్నారు. రేపు మైనార్టీ డిక్లరేషన్ ప్రకటిస్తామని అన్నారు. కాంగ్రెస్ హయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ యూనివర్సిటీ నేడు సమస్యల్లో ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్ మెంట్ మరిచిపోయారన్నారు. పదేళ్ళ కేసీఆర్ పాలన అంతా అస్తవ్యస్తంగా ఉందని పేర్కొన్నారు. నిజామాబాద్ తనకు కొత్తేమీ కాదని నిజామాబాద్ తొ నాకు విడదీయలేని సంబంధం ఉందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ డిసిసి అధ్యక్షునిగా రెండు పర్యాయాలు, మంత్రిగా ఇక్కడ ప్రతి ఇంటితో నాకు అనుబంధం ఉందన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తతో కుటుంబ సభ్యుల తరహా అనుబంధం ఉందని, డి. శ్రీనివాస్ తో రామలక్ష్మణ అనుబంధం ఉందన్నారు. 10 సంవత్సరాలలో ఎంతో వెనక పడిపోయామన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేసులతో బీఆర్ఎస్ నాయకుల దాడులతో తమ ఆస్తులు భూములు కబ్జాలతో ఎంతో కుంగి కృషించి పోయారని ఆరోపించారు. అందరూ ఐకమత్యంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి పట్టణ ప్రజలందరికీ సేవ చేద్దామన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మనం చేసే అభివృద్ధి గురించి ఆరు గ్యారెంటీ పథకాల గురించి ప్రజలందరికీ చేరవేయాలని, మరోవైపు మీ ఆప్యాయత మీ అభిమానం ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. నిజామాబాద్ నాయకులు కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారని మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కేశవేణు, నిజామాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులు మనాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత,మాజీ ఎమ్మెల్సీ అరికెల నరసారెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షుడు గడుగు గంగాధర్, పీసీసీ ఉపాధ్యక్షులు తహర్ బిన్ హందన్, సీనియర్ నాయకులు నగేష్ రెడ్డి, మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ, విక్కీ యాదవ్ , రామ్మర్తి గోపి, రోహిత్, రామకృష్ణ, ఘన్రాజ్, సుమన్ పెద్ద సంఖ్యలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.