నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బంజారహిల్స్‌లోని (ఐసీసీసీ) పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జాయింట్ సీపీ (అడ్మిన్) జే.పరిమళ హనా నూతన్ జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీలు, జాయింట్ సీపీలు, డీసీపీలతోపాటు పోలీస్ అధికారులు, కమిషనరేట్‌లో పనిచేస్తున్న వివిధ శాఖలకు చెందిన అధికారులు పెద్దఎత్తున పాల్గొన్నారు.