దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ

– జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ
నవతెలంగాణ – చిన్నకోడూరు 
బిఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందని దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ మారిందని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎంపిపి కూర మాణిక్య రెడ్డి అన్నారు. మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు మండలంలోని విఠలాపూర్ రైతు వేదికలో సోమవారం గంగాపూర్, రంగాయిపల్లి, విఠలాపూర్ గ్రామ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర రైతులకు కేంద్ర బిందువుగా బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. 3 గంటల కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీని, స్టార్టర్లకు మీటర్లు పెడతామన్న బిజెపిని రైతులు నమ్మెద్దని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. సీఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావు నాయకత్వంలో పొలాలకు సాగునీరు అందించటంతో రైతులు బంగారు పంటలు పండిస్తున్నారన్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలంగా మారాయన్నారు. గ్రామాల్లోని చెరువులు, కుంటలు,చెక్ డ్యాములు నీటితో నిండి కలకలలాడుతున్నాయన్నారు. సిద్దిపేట జిల్లాను మంత్రి హరీష్ రావు ప్రాజెక్టుల ఖిల్లాగా మార్చినాడన్నారు. కడుపునిండా అన్నం పెట్టే రైతుకు ప్రభుత్వం అండగా నిలిచిందని దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందించారన్నారు.గత ప్రభుత్వాల హయాంలో రైతుల ఆత్మహత్యలు ఉండేవని నేటి తెలంగాణ రాష్ట్రంలో రైతుకు ఆత్మగౌరవం దక్కిందన్నాడు. ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని కోరారు. ఈసందర్భంగా మూడు గంటల కరెంటు వద్దు,మూడు పంటలు ముద్దు అని రైతులంతా తీర్మానం చేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ, వైస్ ఎంపీపి కీసరి పాపయ్య, మండల పార్టీ అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, జిల్లా రైతు బంధు సమితి సభ్యుడు మేడికాయల వెంకటేశం, డిసిసిబి డైరెక్టర్ నముండ్ల రామచంద్రం, మండల రైతు బంధు సమితి చైర్మన్ పరకాల మల్లేశం గౌడ్, అల్లిపూర్ పిఏసిఎస్ చైర్మన్ బొడిగె సదానందం గౌడ్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు కాముని ఉమేష్ చంద్ర, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఇట్టబోయిన శ్రీనివాస్, సర్పంచ్ లు మద్దికుంట నవీన్, పన్యాల లింగారెడ్డి, సిద్దుల శ్రీనివాస్, ఎంపీటీసీలు సింగిరెడ్డి సునీత సాగర్ రెడ్డి, ఎడ్ల వెంకటలక్ష్మియాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.